october-6 2020.jpg

Comments

    • Janahitha - Telugu Matrimony

      కృష్ణయజుర్వేద విద్యార్థులకు సువర్ణావకాశం. తి.తి.దే వారి వేదవిశ్వవిద్యాలయంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ యూనివర్సిటీలో కృష్ణయజుర్వేదం అధ్యయనం చేసేందుకు కావాల్సిన అర్హతలు:16సంవత్సరాలు నిండిన మరియు మూలం 82 ప్రశ్నలు పూర్తి అయిన విద్యార్థులకు మాత్రమే 3సంవత్సరాల క్రమాన్తం కోర్సు(B. A.) లో చేరుటకు అర్హులు. 2సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఘనాన్తం (M.A.)కోర్సులో చేరుటకు 18 సంవత్సరాలు నిండిన మరియు క్రమాన్తం అధ్యయనం చేసిన వారే అర్హులు. అదనపు ప్రయోజనాలు :క్రమాన్తం (B.A.)కోర్సులో చేరు విద్యార్థులకు 3 లక్షలు, ఘనాన్తం ( M.A.)కోర్సులో చేరు విద్యార్థులకు లక్షరూపాయలు వారి పేర జమచేసి వారు ఉత్తీర్ణులైన పిదప వడ్డీతో కలిపి ఇవ్వబడును. (B.A/M.Aసర్టిఫికెట్ కూడా ఇవ్వబడును). చేరగోరు విద్యార్థులకు ముఖ్యసూచనలు:విశ్వవిద్యాలయంలో ఉండి అధ్యయనం చేయాలనుకునే విద్యార్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది మరియు చేరుటకు గురువుల అనుమతి తప్పనిసరి. పైన పేర్కొన్న కోర్సులలో వేదము మరియు సంస్కృతం ప్రముఖంగా, ఆంగ్లము మరియు కంప్యూటర్ పరిచయ రూపంలో బోధింపబడును. భోజనం, వసతి ఉచితము. లౌకిక ఆకర్షణ కలిగిన ఆధునిక చదువులపై మొగ్గు చూపుతూ ప్రాచీన సంప్రదాయ వేదవిద్యలను చిన్నచూపు చూస్తున్న ఈ తరుణంలో వేదపరిరక్షణ నిమిత్తం తితిదే మరియు వేదవిశ్వవిద్యాలయముల సంయుక్త కార్యాచరణలో ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. మరిన్ని వివరాలకు సంప్రదించండి 'సూర్యనారాయణమూర్తి ఘనపాఠీ, 9949191999